NZB: జీజీ కళాశాలలో బుధవారం నిర్వహించిన 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలకు 1,071 విద్యార్థులకు 1,052 మంది విద్యార్థులు హాజరై 19 మంది గైర్హాజరైనట్లు పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, ప్రిన్సిపల్ ప్రొ. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 149 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ముగ్గురు విద్యార్థులు డిబారైనట్లు పేర్కొన్నారు.