RCBతో జరుగుతున్న మ్యాచ్లో LSG వరుసగా వికెట్లు కోల్పోతోంది. 11.2 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. మార్ష్ (40), మార్క్రమ్ (12), పూరన్ (1), సమద్ (0) తక్కువ పరుగులకే అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో బదోని (29), ముఖుల్ చౌధరీ (5) బ్యాటింగ్ చేస్తున్నారు. హెజెల్వుడ్ తన 3 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. కృనాల్ 2 వికెట్లు తీశాడు.