JN: పెంబర్తిలో నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) భూ సేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్లో రైల్వే, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించి వెంటనే నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో గోపిరాం, రైల్వే అధికారులు పాల్గొన్నారు.