BDK: అన్నపురెడ్డిపల్లి మండలం మర్రిగూడెం గ్రామానికి చెందిన వీరబోయిన త్రివేణి D/O మోహన్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ నేపథ్యంలో అత్యవసర శస్త్రచికిత్స అవసరమైన తరుణంలో బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణను సంప్రదించగా వెంటనే స్పందించి ప్రభుత్వ సహాయం ద్వారా రూ.75,000/-ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి నేడు అందించారు.