BDK: బూర్గంపాడు మండలంలోని మొరంపల్లి బంజర గ్రామ అధ్యక్షుడు వీరారెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు ఆదివారం మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.