KKD: అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ఈ నెల 26 నుంచి మే 2 వరకు దివ్య కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలయ ఇంఛార్జి ఈవో నల్లం సూర్య చక్రధరరావు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభని కలిసి మహోత్సవానికి హాజరు కావాలని కోరారు.