సత్యసాయి: జిల్లాలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. వడదెబ్బ తగలకుండా కాటన్ దుస్తులు ధరించాలని, తరచుగా మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలన్నారు.