కోనసీమ: పోలీస్ శాఖ మోటారు ట్రాన్స్పోర్టు కార్యాలయం వద్ద అమలాపురం ఈ నెల 21న పాత విడిభాగాలకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. వాహనాల మరమ్మతుల అనంతరం తొలగించిన విడిభాగాలకు ఆ రోజు ఉదయం 10 గంటలకు వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తి గల బిడ్డర్లు నిర్ణీత సమయానికి ఎంటీ కార్యాలయానికి చేరుకుని వేలంలో పాల్గొనాలని సూచించారు.