GNTR: అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఆమె రూ.76 లక్షలను అన్న క్యాంటీన్లకు విరాళంగా అందించారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో అన్న క్యాంటీన్ సీఈవోకు సదరు చెక్కును అందజేశారు.