MDK: రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, పచ్చి రొట్టె ఎరువులతో భూసారాన్ని కాపాడుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవి రైతులకు సూచించారు. ఆదివారం కౌడిపల్లి మండలం రాజిపేటలో నిర్వహించిన ‘భూ పోషణ’ అవగాహన సదస్సులో మాట్లాడారు. యూరియా, డీఏపీ వంటి ఎరువులను మితిమీరి వాడటం వల్ల నేల నిస్సారమై దిగుబడులు తగ్గుతాయని హెచ్చరించారు.