భూపాలపల్లి జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించిన నేపథ్యంలో సభ ప్రాంగణం వద్ద విస్తృతంగా ఏర్పాట్లను చేస్తున్నారు. రేపు మేడిగడ్డను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభకు విచ్చేసే ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.