AP: కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ధర్మాన మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం తిరోగమనంలో ఉందని.. ప్రధాన ప్రతిపక్షాన్ని అల్లరి పాలు చేసే కుట్రలు చేస్తున్నారు. రెడ్‌బుక్‌లో ఉన్నవారిని వేధిస్తూ ఇదే మా పాలన తీరని చెబుతున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను తీవ్రవాదులను వేటాడినట్లు వేటాడుతున్నారు. రెండేళ్లలోనే కూటమి గ్రాఫ్ పడిపోయింది’ అని పేర్కొన్నారు.