TPT: చిన్నగొట్టిగల్లు-రొంపిచెర్ల సరిహద్దుల్లో అనుమతులు లేకుండా గ్రానైట్ మైనింగ్ జరుగుతున్నట్లు వైఎస్ఆర్సీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆరోపించారు. కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ అక్రమంగా తరలిస్తున్నారని, ఇందులో ఎమ్మెల్యే పులివర్తి నాని పాత్ర ఉందని విమర్శించారు. అధికారులు స్పందించకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.