ప్రకాశం: పొదిలి మండలం గోగినేనివారి పాలెం గ్రామంలో గుర్తుతెలియని దుండగులు పోలేరమ్మ గుడి ఆలయ తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అమ్మవారికి అలంకరించిన 700 గ్రాముల వెండి కిరీటం, ముక్కుపుడక, ఆలయంలో ఉన్న కొంత నగదు, హుండీ దొంగిలించినట్లు గ్రామస్థులు తెలిపారు. సమాచారం అందుకున్న పొదిలి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.