GDWL: మన ఊరు-మన కొత్తపల్లి’ నినాదంతో గ్రామాభివృద్ధి దిశగా యువత అడుగులు వేస్తోంది. ఇక ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి గ్రామంలోని ఒక్కో వార్డును దత్తత తీసుకుని క్లీన్ అండ్ గ్రీన్ పనులు చేపట్టనున్నారు. నీటి వృథా, బహిరంగ మలవిసర్జన వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, సర్పంచ్ సుజాత ఆంజనేయులు, ఉపసర్పంచ్ సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.