W.G: నరసాపురం మండలం వేములదీవి పడమరలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం .. బుధవారం ఉదయం చేపల వేటకు వెళ్లిన బొమ్మిడి యేసుబాబు (53) అనే మత్స్యకారుడు ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే నరసాపురం తహసీల్దార్ ఐవీవీ సత్య నారాయణ, ఆర్ఐ సురేఖ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.అతన్ని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.