గుజరాత్ జెయింట్స్‌తో జరుగుతున్న కీలక పోరులో KKR స్టార్ బ్యాటర్ కెమెరూన్ గ్రీన్ చెలరేగిపోయాడు. వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్న గ్రీన్, ఈ మ్యాచ్‌లో కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలకు గట్టి సమాధానమిచ్చాడు. IPL కెరీర్లో గ్రీన్‌కు ఇది మూడో హాఫ్ సెంచరీ.