VKB: ఈ నెల 20 నుంచి 27 వరకు TOSS SSC, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు శనివారం ఓ ప్రకటనలో SP స్నేహ మెహ్రా తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని SP ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.