VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవానికి జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది రెండు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఉత్సవం రోజున తెల్లవారుజామున 4 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. భక్తులు తమ సొంత వాహనాలను ఫుట్ హిల్స్ పార్కింగ్‌లో ఉంచి, ఉచిత ప్రత్యేక బస్సుల్లో కొండపైకి రావాలని కలెక్టర్ కోరారు.