ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో PM జనమన్ పథకం సమగ్ర సర్వే శిక్షణ ప్రారంభమైందని డిప్యూటీ డైరెక్టర్ రమాదేవి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామస్థాయిలో గిరిజనుల వివరాలను సేకరించి సర్వేను సమర్థవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ పథకం ద్వారా గిరిజనుకు ఆధార్, ఆయుష్మాన్ కార్డు, జన్ ధన్ ఖాతాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు సేవలు అందుతాయన్నారు.