AP: విజయవాడ కలెక్టరేట్లో ఉద్యోగులపై ఓ వృద్ధురాలు కారం చల్లింది. నందిగామ మం. అనాసాగరానికి చెందిన లక్ష్మీతులసి.. 2003లో రోడ్డు విస్తరణకు తీసుకున్న తన భూమికి ఇప్పటికైనా పరిహారం ఇవ్వాలని అధికారులను కోరింది. దీనిపై తమకు సంబంధం లేదని, NHAI అధికారులనే కలవాలని భూసేకరణ అధికారులు చెప్పడంతో ఆమె ఆగ్రహానికి లోనై కారం చల్లింది. ఇంకెన్నాళ్లు పరిహారం కోసం ఇలా తిరగాలని వాపోయింది.