GDWL: గట్టు మండలం అరగిద్ద ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత నెలకొనడంతో గ్రామస్తులు పాఠశాలకు తాళం వేసి నిరసన తెలిపారు. ఈ నిరసనకు పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు హాలింపాషా సంపూర్ణ మద్దతు తెలియజేశారు. గ్రామంలో 306 విద్యార్థులు ఉండగా.. వారికి ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయలు ఉండడం వల్ల ప్రతి రోజు విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు లేరని వాపోయారు.