HNK: అంబేద్కర్ జయంతి సందర్భంగా హనుమకొండలో జ్ఞాన జ్యోతి యాత్రను నిర్వహించనున్నారు. హనుమకొండ నక్కలగుట్టలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే నాగరాజు సమావేశమయ్యారు. కుల, మత విభేదాలు లేకుండా స్వచ్ఛందంగా విజ్ఞాన జ్యోతి యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని, రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్వహించేలా యాత్రను ఘనంగా నిర్వహిద్దామన్నారు.