చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ నేరమా?కాదా? అనే అంశంపై సుప్రీంకోర్టు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. చైల్డ్ పోర్నో గ్రఫీ నేరం కాదని.. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరిపిన సీజేఐ ధర్మాసనం.. కాసేపట్లో తుది తీర్పు వెల్లడించనుంది. జనవరి 11న 28 ఏళ్ల యువకుడు చైల్డ్ పోర్నో గ్రఫీ వీడియోలను డౌన్ లోడ్ చేయడంతో.. ఆయనపై కేసు నమోదైంది. ఆ వీడియోలను అతను చూశాడని.. ఇతరులకు పంపలేదని.. అది నేరం కాదని మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.