తమ జట్టు కొన్నేళ్లుగా IPL కప్ గెలవలేదన్న వార్తలపై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేలా జయవర్ధనే స్పందించాడు. దీనిపై ఎక్కువగా ఆలోచించి ఒత్తిడి పెంచుకోవాలని అనుకోవట్లేదన్న అతను.. కొన్ని టీమ్స్ ఇంకా కప్ గెలవలేదని గుర్తుచేశాడు. ఇవి ఫన్ కోసం చేస్తున్న కామెంట్స్ కాదని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చాడు. కాగా PBKS, DC, LSG జట్లు ఇంకా IPL కప్ అందుకోలేకపోయాయి.