SRCL: గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రతిబింబించేలా “రన్ ఫర్ ఏ జీసస్” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని వేములవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వాసులు, యువత పెద్దఎత్తున పాల్గొని పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ తీశారు. ప్రార్థనలు, కీర్తనలు చేస్తూ యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగారు.