PPM: జిల్లావ్యాప్తంగా రేపటి నుంచి ఈ నెల16 వరకు అన్ని పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంగ్రహణాత్మక మూల్యాంకనం-II పరీక్షలు నిర్వహించనున్నట్లు DEO బ్రహ్మాబీ రావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశామని, పరీక్షల పారదర్శక నిర్వహణ కోసం జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు.