SRPT: తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గుట్టపై వెలసిన ఉగ్ర శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం వేద మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాడిపంటలతో గ్రామం సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు వేడుకున్నారు. ఈ వేడుకలో గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.