TG: సికింద్రాబాద్లో వీర హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసింది. గౌలిగూడ, కర్మన్ఘాట్ల మీదుగా తాడుబండ్కు శోభాయాత్ర చేరుకుంది. ఈ క్రమంలో వీరాంజనేయస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరారు. కాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జరిగిన ఈ యాత్రలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.