BDK: లక్ష్మీదేవి పల్లి మండలం మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న మురుగు కాలువలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. కాలువలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాల కోసం ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.