TG: గ్రూప్-1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వాదనల అనంతరం.. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. గ్రూప్-1 అభ్యర్థుల పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్‌నాథ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. కాగా గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు సుప్రీంను ఆశ్రయించారు. నోటిషికేషన్ రద్దు చేసి.. మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు.