ADB: జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో జేఈఈ మెయిన్స్ తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం జరిగిన సెషన్‌కు మొత్తం 80 మంది విద్యార్థులకు గాను 73 మంది హాజరు కాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని పరీక్షల కో-ఆర్డినేటర్ పున్నారావు తెలిపారు. విద్యార్థులు నిబంధనల ప్రకారం పరీక్షకు హాజరయ్యేలా అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.