PDPL: ఎలిగేడు ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ మహిళ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు, శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బడి మానేసిన, అనాధ పిల్లలు, బాలల అక్రమ రవాణా, వేధింపులపై చర్చించారు. వీటిని నివారించేందుకు తగు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.