KRNL: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీతో పాటు పార్లమెంట్లో ఆమోదం పొందిన సందర్భంగా మంత్రాలయం మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ బీ.తిక్కన్న ఇవాళ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పెద్దకడబూరులో జ్యోతి వెలిగించి CM చంద్రబాబు, PM మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి లభించిన ఈ చట్టబద్ధత ఏపీ ప్రజల గెలుపుగా పేర్కొన్నారు.