PDPL: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ ఆయన సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాబోయే విద్యా సంవత్సరం నాటికి పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని తెలిపారు. మంథనిలో స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు. మే 15 నాటికి PDPL మంథని మధ్య బీటీ రోడ్డు పనులు పూర్తి కావాలన్నారు.