TG: రాజ్యసభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా మరో ద్రోహానికి పాల్పడ్డారని.. ఉద్యమంలో వెన్నుచూపిన నేత కిషన్ రెడ్డి అని విమర్శించారు. ఏడు మండలాలను ఏపీకి అప్పగించాలనడం తెలంగాణకు చేస్తున్న తీరని ద్రోహం అని మండిపడ్డారు. ఈ పాపంలో కిషన్ రెడ్డి పాత్ర కూడా ఉందన్నారు.