KDP: అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు చట్టబద్ధత కల్పించడంతో వైవీయూ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో హర్షం వ్యక్తమైంది. గురువారం హెచ్వోడీ డా. పి. సరిత ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు స్వీట్లు పంచుకున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.