ASR: చింతపల్లి ముత్యాలమ్మ జాతరకు పటిష్ట భద్రత కల్పించనున్నట్టు ఏఎస్పీ నవజ్యోతి మిశ్రా తెలిపారు. గురువారం జాతర పోస్టర్లను ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈనెల 14నుంచి 17వరకు నిర్వహించనున్న ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు. పోలీసు శాఖ జాతరకు ప్రత్యేక బందోబస్తు కల్పిస్తుందన్నారు.