ADB: గాదిగూడ మండలంలోని కుండి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కుండి కొలాంగూడ నుంచి పిప్రి వరకు అధ్వానంగా రోడ్డు ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో సర్పంచ్ పూసం బాదిరావు నూతన బీటి రోడ్డు మంజూరు చేయించుకొని గురువారం పనులను ప్రారంభించారు. వీలైనంత త్వరలో పనులను పూర్తి చేయాలనీ గుత్తేదారులకు సూచించారు.