JGL: జగిత్యాల సమీకృత కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బి.ఎస్. లత మాట్లాడుతూ, పాపన్న గౌడ్ సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానేత అని, ఆయన జీవితం ధైర్యానికి, నిబద్ధతకు ప్రతీక అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.