NLG: బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా సహాయ కార్యదర్శిగా పీఏపల్లి మండల కేంద్రానికి చెందిన పొతెం కరుణాకర్‌ను గురువారం రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ సందర్బంగా కరుణాకర్ మాట్లాడుతూ.. జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై బాలల వెట్టిచాకిరీ, బాల్య వివాహాల వంటి వాటి నిర్మూలనకై పాటు పడతానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.