KNR: తిమ్మాపూర్ SBI ఆర్సెటీ ఆధ్వర్యంలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు ఇంఛార్జ్ శ్రీపాద స్వప్న తెలిపారు. 19-45 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలు ఆధార్, రేషన్ కార్డ్, ఎస్ఎస్సీ మెమో, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, 2 ఫోటోలతో ఈనెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు తిమ్మాపూర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.