TG: HYDలోని నాగోల్‌లో పోలీసులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. MDMA డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరిని ఎల్బీనగర్ SOT బృందం, నాగోల్ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 25.65 గ్రాముల MDMA డ్రగ్స్, రూ.3,61,990 విలువైన నగదు, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తెచ్చి నగరంలో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు.