AP: తెలుగు ప్రజలంతా నిర్మించుకున్న HYD నుండి రాజధాని లేకుండానే ఏపీ విడిపోయిందని నారా లోకేష్ పేర్కొన్నారు. అందరి అంగీకారంతోనే రాజధానిగా అమరావతిని ఎంపిక చేశామని, రైతులు 35 వేల ఎకరాలు త్యాగం చేశారని గుర్తుచేశారు. గత ఎన్నికల ముందు అమరావతికే జై కొట్టిన జగన్, గెలిచిన ఆరు నెలలకే మూడు రాజధానుల డ్రామా మొదలుపెట్టి ప్రజలను వంచించారని ఆయన విమర్శించారు.