SRCL: జిల్లాలో ఇవాళ్టి పదో తరగతి ఫిజిక్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని డీఈవో జగన్మోహన్ రెడ్డి తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 34 కేంద్రాలలో మొత్తం 7,319 మంది విద్యార్థులకు గాను 7,311 మంది హాజరు కాగా, 8 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో 99.89 శాతం హాజరు నమోదైందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు.