NTR: ఆటిజాన్ని సరైన విధంగా అర్థం చేసుకుని.. చిన్నారులకు ఆత్మీయత పంచుదామని కలెక్టర్ లక్షీశ అన్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేక సామర్థ్యాలు ఉంటాయని పేర్కొన్నారు. వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేను ఇవాళ విజయవాడ అయోధ్యనగర్లో చేయూత మానసిక దివ్యాంగుల శిక్షణ సంస్థలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆటిజం ఉన్నవారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.