TG: రాష్ట్రంలో స్కూళ్లకు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం 48 రోజుల పాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. వేసవి సెలవుల తర్వాత జూన్ 12వ తేదీన మళ్లీ స్కూళ్లు ప్రారంభమవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.