SRCL: వేములవాడ రాజన్న ఆలయ ఈవో రమాదేవిని కలిసి పారిశుధ్య కార్మికులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. వేతనాలను కాంట్రాక్టర్ల ద్వారా కాకుండా నేరుగా దేవస్థానమే చెల్లించాలని, తమను ఆలయ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో (ESI) ఆస్పత్రి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.