TPT: తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థులకు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చైన్ స్నాచింగ్, సైబర్ మోసాలు, మహిళల అక్రమ రవాణా వంటి నేరాలపై జాగ్రత్తలు వివరించారు. విద్యార్థులకు “గుడ్ టచ్- బ్యాడ్ టచ్”పై అవగాహన కల్పించి, వ్యక్తిగత భద్రతపై సూచనలు ఇచ్చారు. సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదని తెలిపారు.