PLD: ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే ఎండ తీవ్రత అధికంగా కనబడుతుంది అని నిపుణులు అన్నారు. గురువారం మధ్యాహ్నం ఎండ సుర్రుమంటూ కాయడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు సాహసించలేకపోతున్నారు. ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. చిరు వ్యాపారులు సైతం తమ దుకాణాలు మూసి ఇంటికి పరిమితమయ్యారు. వేసవి తాపానికి వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులకు గురైతున్నారు.